ఏడాదిలో ఐదు సినిమాలు

rakul
rakul

ఓ హీరోయిన్‌ రేంజ్‌ తెలిసేందుకు ఆమె చేసే సినిమాల వాసితోపాటు రాసి కూడ ముఖ్యమే. ఎన్ని క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌ చేయగలిగారనే పాయింట్‌ను గమనించాల్సిందే. 2017 చివరకు వచ్చేసింది. మన దగ్గర హీరోయిన్లకు కొరత లేదు కానీ క్రేజీ భామలు మాత్రం కొంతమందే ఉంటారు. మలయాళీ భామల దాడి పెరగటంతో పలు ప్రాజెక్టులను మన హీరోయిన్లు మిస్‌ అయినా. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాత్రం ఏకంగా అయిదుసినిమాలతో తన పత్తా చూపించేసింది.
గత ఏడాది ‘ధృవతో గ్రాండ్‌గా 2016కు ముగింపు పలకగా ఈ ఏడాది రకుల్‌ప్రీత్‌ నటించిన అయిదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. విన్నర్‌ అంటూ మొదలుపెట్టినా. విజయం దక్కించుకోలేకపోయిన రకుల్‌. ఆ తర్వాత రారండోయ్‌ వేడుక చూద్దాం అంటూ సక్సెస్‌ను టేస్ట్‌ చేసింది. ఫెర్ఫామెన్స్‌కు గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జయ జానకి జానకలో ఈ భామ నటనకు మంచి మార్కులు పడ్డా భారీ విజయం దక్కలేదు. దసరాకు వచ్చిన మహేష్‌ స్పైడర్‌పై రకుల్‌ చాలానే ఆశలుపెట్టుకున్నా అవి నెరవేరలేదు.
నవంబర్‌లో కార్తీతో కలిసి నటించిన ఖాకీ చిత్రం విజయం సాధించటం రకుల్‌కు ఊరటనిచ్చిందని అంటున్నారు. మొత్తం మీద మిగిలిన హీరోయిన్లు అంతా ఒకట్రెండు సినిమాలకే పరిమితం అయిపోయిన టైంలో రకుల్‌ మాత్రం ఏకంగా అయిదు చిత్రాలను విడుదల చేయగలిగింది. క్యారెక్టర్ల ఎంపికలో కాసింత జాగ్రత్త వహిస్తే రకుల్‌ టాప్‌ రేంజ్‌కు చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉనాయనేది ఫిల్మ్‌నగర్‌ టాక్‌.