ఎఫ్‌డిసి చైర్మన్‌ రామ్‌మోహన్‌రావు కుమార్తె వివాహ వేడుక

Wedding Celebration

ఎఫ్‌డిసి చైర్మన్‌ రామ్‌మోహన్‌రావు కుమార్తె వివాహ వేడుక

తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావ్ఞ రేణుకరావ్ఞల కుమార్తె దేదీప్య వివాహం విష్ణుచరణ్‌తో బుధవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్రముఖ్యమంత్రి కెసీఆర్‌, మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌.విద్యాసాగర్‌రావ్ఞ, రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, నమస్తే తెలంగాణ సిఎండి దామోదర్‌రావ్ఞ, కే. కేశవరావు. జి.వివేక్‌, వినోద్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావ్ఞ, యాదవరెడ్డి సినీ ప్రముఖులు కృష్ణ, సురేష్‌బాబు, సుధాకర్‌రెడ్డి, నితిన్‌, అల్లు అరవింద్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి,కె. మురళీమోహన్‌రావ్ఞ, బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సి.కళ్యాణ్‌, ఆర్‌.నారాయణమూర్తి, వి.వినాయక్‌, జెమిని కిరణ్‌తో పాటు పలువ్ఞరు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.