ఎన్.శంకర్ తాజాగా సునిల్ తో

SUNIL22
SUNIL

జయం మనదేరా, శ్రీ రాములయ్య, ఎన్ కౌంటర్ సినిమాలు తీసిన ఎన్.శంకర్ తాజాగా సునిల్ తో మలయాళంలో హిట్ అయిన 2 కంట్రీస్ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో తీస్తున్నాడు. సునీల్ సరసన మనీషారాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. అధికశాతం అమెరికా లో చిత్రికరిచిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి , పృథ్వి, నరేష్ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాలో సునీల్ తనకు సరిగ్గా సరిపోయే రోల్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చెయ్యనున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన మాటలు రాస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాతో సునీల్ మంచి విజయం అందుకోవాలని కోరుకుందాం.