ఉగాదికి చైతు గిఫ్ట్‌!

CAHITU
CAHITU

ఉగాదికి చైతు గిఫ్ట్‌!

ఉగాది పండుగ సందర్భంగా కొంతమంది హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతూ వుంటే, మరికొంతమంది హీరోలు తమ సినిమాల ఫస్టులుక్‌ లు .. టీజర్లు రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. అలా తన సినిమాకి సంబంధించిన ఫస్టులుక్‌ తో సందడి చేయడానికి నాగచైతన్య కూడా సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా కల్యాణ్‌ కష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. రకుల్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి రారండో§్‌ు వేడుక చూద్దాం అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ఫస్టులుక్‌ ను ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌ పై రూపొందుతోన్న ఈ సినిమాను , వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ==