ఉందండీ…త‌ప్ప‌కుండా చేస్తాం..

                               ఉందండీ…త‌ప్ప‌కుండా చేస్తాం..

SUDHEER BABU
SUDHEER BABU

మంచి కథలను ఎంపిక చేసుకుంటూ,,తనకంటూ ప్రత్యేకంగా ఓ దారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. సుధీర్‌బాబు తాజాగా ఆయన నటించిన చిత్రం సమ్మోహనం.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన చిత్రమిది.. ఈసినిమాగురించి సుధీర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడారు.
సమ్మోహనం ఎలా మొదలైంది
ఇంద్రగంటిగారు ఒకరోజు ఫోన్‌ చేసి ఒకస్క్రిప్టు ఉంది వినండి అన్నారన్‌ హు.. నాతొలిసినిమా శ్రీఎస్‌ఎంఎస్‌ విడుదలకు ఓ వారం ముందు ఇంద్రగంటిగారితో ఓ సినిమాచేద్దామనుకున్నా.. ఓ ప్రొడక్షన్‌ హస్‌తో సైన్‌ కూడ అయ్యిటి ది. విడుదలకు వారం ముందు ఇంద్రగంటి గారితో ఓ సినిమా చేద్దామనుకున్నాను.. ఓ హౌస్‌లో సైన్‌ కూడ అయ్యింది. కానీ టేకాఫ్‌ కాలేదు. ఈసినిమాకు అవసరాల శ్రీనివాస్‌ సబ్జెక్టు ఇచ్చేట్టు. ఆంద్రగంటి గారు డైరెక్టు చేసే అనుకున్నారు..

మీ పాత్ర ఎలా ఉంటుంది?
నేను చిల్డ్రన్‌ బుక్స్‌ ఇల్లస్ట్రేటర్‌గా కన్పిస్తాను. ఇందులో నాపేరు విజ§్‌ు.. ఐడలిస్టిక్‌ పర్సన్‌ని.. సినిమా ఇండస్ట్రీ మీద సినిమా స్టార్స్‌మీద కొన్ని అభిప్రాయాలుంటాయి.. ఆదితీరావు ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా నటించింది.. మేకప్‌తో, మేకప్‌ లేకుండా స్టార్‌ లైఫ్‌ ఎలా ఉంటుందో తెలుసుకుంటాను నేను.మేమిద్దరం ఎలా కనెక్ట్‌ అయ్యామనేదే సినిమా

కామన్‌ ఆడియెన్స్‌ డౌట్స్‌ని క్లియర్‌ చేసేటట్టు ఉంటాయా?
క్లియర్‌చేయటం కాదు . ఓ కామన్‌ ఆడియెన్‌కి ఉన్న డౌట్స్‌ని ఆన్‌స్క్రీన్‌ మీద డిస్కస్‌ చేస్తునట్టు ఉంటుంది.

ఎవరెవరు గెస్ట్‌రోల్‌ చేశారు?
హరీశ్‌ శంకర్‌, అవసరాల శ్రీనివాస్‌, తరుణ్‌భాస్కర్‌గార్లు గెస్ట్‌రోల్స్‌ చేశారు.. హీరోలు ఎవయీ ఇందులో గెస్ట్‌రోల్స్‌ చేయలేదు.

ఇంద్రగంటి కైండ్‌ ఆప్‌ ఫిల్మ్‌మేకింగ్‌ ఎలా ఉంది?
ఆయన ఇప్పటిదాకా ఇలాంటి ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ చేయలేదు.. అంతకుముందు ఆ తర్వాత ఉన్నా.. అది వేరు.. ఇది ఆయన తెరకెక్కించిన ప్రాపర్‌ లవ్‌స్టోరీ.. ఈ టైప్‌ ఆఫ్‌గా డీల్‌ చేసిన సినిమాలు ఇంతకు ముందు రాలేదు.. ఏమాయ చేసావె.. కూడ వేరు.. ఈసినిమాలో ఫన్‌ ఉంటుంది.. మంచి రొమాన్స్‌ కూడ ఉంటుంది.

యాక్షన్‌ ఇమేజ్‌ ఏంటి?
యాక్షన్‌ ఇమేజ్‌ అల్రెడీ ఉంది. కేవలం బాడీ పెట్టుకుని సినిమా చేసినా కుదరదు. ఇందులో ఇల్లస్ట్రేటర్‌ గన్నులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పెన్నులుపట్టుకుంటే చాలు.

మీ కెరీర్‌లో ఈ మధ్య రియాల్టీకి దగ్గరగా వెళ్తున్నట్టున్నారు?
అలాగని కాన్ఫియస్‌గా ఏమీ అనుకోలేదండీ.. నాకు నచ్చిన స్క్రిప్టుల్లో ఇవి నచ్చినవి అందుకని వీటిని చేశానంతే….

మీ గొంతు ఇపుడు మరింత మెచ్యూర్‌గా అయినట్టుంది?
వాయిస్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నానండీ..ఒకవేళ ఇపుడుమానేసినా మళ్లీ ఫీలగా కన్పిస్తోంది.

ఈ మధ్య ప్రొడక్షన్‌ హౌస్‌ని మొదలుపెట్టారు?
అవునండీ..మన చుట్టూ చాలా మంది ప్రతిభావంతులున్నారు.. కొరియోగ్రాఫర్లుపాటలురాసేవాళ్లు.. నటీనటులు, ఎంతో టాలెంట్‌ ఉండి కూడ ఇక్కడ తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు.. నేనుప్రొడక్షన్‌ స్టార్ట్‌చేస్తే బావుంటుదన్పించింది చేశా.. చాలా మంది వచ్చి కలుస్తూనే ఉన్నారు.

పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఎంత వరకు వచ్చింది?
సెప్టెంబర్‌ నుంచి ఉంటుంది.. చాలా చాలెంజింగ్‌ స్క్రిప్టు ప్రవీణ్‌సత్తారుగారి దర్శకత్వంలో చేస్తున్నా. బయోపిక్‌ అనగానే బాడీ లాంగ్వేజ్‌ పట్టుసి చేసేస్తారు.. అలా కాకుండా ఆ వ్యక్తి మనసునుకూడ పట్టుకోగలగాలి. నేను కూడ గోపీచంద్‌ బాడీ లాంగ్వేజ్‌ కూడ నేర్చుకుంటున్నా.. కొన్నాళ్లు అతనితో ఉండి ఆయన ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకోవాలనుకుంటున్నా.. ఈసినిమా కోసం ప్రాక్టీస్‌ కూడ చేస్తున్నా.
మీ నెక్ట్స్‌మూవీస్‌ ఏంటి?
నా సంస్థలోనే ఓసినిమా ఉంది.. అది లవ్‌స్టోరీ 70 పర్సెంట్‌ సిద్దమైంది..ఆర్‌ఎస్‌ నాయుడు అని కొత్తఆయన దర్శకత్వం చేస్తారు.

మీ ప్రొడక్షన్‌లో మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉందా?
ఉందండీ.. తప్పకుండా చేస్తాం.. మంచి కథ ఉంటే ఇంద్రగంటి గారి దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా మా బ్యానర్‌లో సినిమా చేస్తే చాలా బావుంటుంది