ఈసినిమాతో రానా స్టార్‌ హీరోల జాబితాలోకి వెళ్తాడు

TEJA-2
TEJA

ఈసినిమాతో రానా స్టార్‌ హీరోల జాబితాలోకి వెళ్తాడు

దర్శకుడు తేజ.. ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చేశారు.. ట్రైలర చూసిన చాలా మంది తేజ ఈసారి హిట్‌ అందుకోవటం ఖాయమనే అంటున్నారు.. సినిమా ఈ శుక్రవారమే విడుదల కానుంది.. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..

ముందుగా ఈ కథను వేరే హీరోకి చెప్పారట కదా?
అవును.. మొదటిసారి లైన అనుకోగానే. ‘అహం అనే టైటిల్‌ పెట్టి రాజశేఖర్‌కు చెప్పాను.. కానీ కొన్ని కారణాల వల్ల అనుకున్న కథను చెడగొట్టటం ఇష్టం లేక ఆ ప్రయత్నం మానుకున్నాను.. ఆ తర్వాత కొంచెం డెవలప్‌ చేసి రానాకు చెప్పాను.. ఆయన వెంటనే ఒప్పుకోవటం వలన సినిమా మొదలైంది.

సినిమా ఎపుడు మొదలైంది?
బాహుబలి2 కంటే ముందే మొదలుపెట్టాను.. కానీ మధ్యలో ఆ సినిమా రావటం, హిట్టవ్వట్టం అన్నీ జరిగిపోయాయి.. ఆ సినిమా తర్వాత మళ్లీ రీస్టార్ట్‌చేసి పూర్తిచేశాను.

ఇంతకు ముందు తేజకి ఈసినిమా తీస్తున్న తేజకి తేడా ఏంటి?
నా గత ఫెయిల్యూర్స్‌ అన్నీ కథలో లోపం ఉండటం వల్లనే పోయాయని నాకు తెలుసు.. అందుకే ఈసారి కథను బలంగా చెబుదామనుకుని ఈసినిమా చేశాను..

ట్రైలర్‌కు ఎలాంటి స్పందన వస్తోంది?
రెస్పాన్స్‌ చాలా బాగుంది.. అప్పటి వరకు నన్ను చూసి మొహాలు తిప్పుకున్న వాళ్లంతా దగ్గరకొచ్చి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి బాగుందంటున్నారు.

ఈసినిమాలో రానాది నెగెటివ్‌ పాత్రా?
నెగెటివ్‌ పాత్రని కాదు.. రెగ్యులర్‌ సినిమాలోల అయితే హీరోలోని పాజిటివ్స్‌ మాత్రమే చూపిస్తారు..కానీ ఇందులో అలా కాదు.. జోగేంద్ర పాత్రలోని మంచిని, చెడుని అన్నిటినీ చూపిస్తాం.. నిజజీవితంలో మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు..

అంటే సినిమా ఎలా ఉంటుంది?
రెగ్యులర్‌ సినిమాలకు ఒక మీటర్‌ ఉంటుంది.. కానీ ఈసినిమాకి అలా ఉండదు.. అలాగని కమర్షియల్‌ అంశాలు లేవని కాదు.. అవి కూడ ఉంటాయి..కానీపాత్రలన్నీ ఆర్ట్‌ సినిమాలో పాత్రల్లా ఉంటాయి.. చిత్రం తర్వాత ఎలాగో ఇది కూడ అలాగే సినిమా మీటర్‌ లెక్కలన్నిటినీ తుడిచేస్తుంది.
కథ పూర్తిగా కొత్తదా?
కాదు. కథ అందరికీ తెలిసిందే.. ఎపుడూ మనచుట్టూ జరిగేతదే.. కానీ తీసిన విధానం, చెప్పిన వైవిధ్యం కొత్తవి.

కాజల్‌ ఎలా నటించింది?
కథ చెప్పగానే సురేష్‌బాబుగారు కాజల్‌ అయితేనేసినిమా చేద్దాం అన్నారు. కాజల్‌ కూడ చాలా డెవలప్‌ అయ్యింది.. ఈజీగా నటించేస్తోంది.. పాత్ర గురించి చెప్పాక. నాకన్నా ఎక్కువగా అందులో లీనమైపోయింది.

ఈసినిమాలో క్యాథరిన్‌ చేత సిగరెట్‌ తాగించినట్టున్నారు?
ఆపాత్ర అలాంటిది.. నా ఏ సినిమా చూసినా అందులో ఆడవాళ్ల పాత్రలు చాలా బలంగా ఉంటాయి.. వాళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది.. ఇందులో కూడ అంతే. కాజల్‌, క్యాథరిన్‌ పాత్రలు చాలా బలంగా ఉంటాయి.

ఈసినిమాతో ఎవరెవరికి పేరొస్తుంది?
ఈసినిమాతో రానా స్టార్‌హీరోల జాబితాలో చేరిపోతాడు.. కాజల్‌కి కూడ మంచి పేరొస్తుంది.. అలాగే సినిమాటోగ్రాఫర్‌, సంగీతం ఇచ్చిన అనూప్‌రూబెన్స్‌కు మంచి పేరొస్తుంది.
సురేష్‌బాబుగారు ఈసినిమాకు ఎలా హెల్ప్‌చేశారు?
నిర్మాతంటే దర్శకుడిని సెట్‌లో ప్రశాంతంగా పనిచేసుకునేలా చేయాలి. సురేష్‌బాబుగారు అలానే చేశారు.. ఆయన వల్ల సినిమాస్థాయి చాలా పెరిగింది.