ఇదేం దెయ్యం ..ఆడియో ఆవిష్కరణ

EDEM DEYYAM-2
EDEM DEYYAM

ఇదేం దెయ్యం ..ఆడియో ఆవిష్కరణ

ఏ వి రమణమూర్తి సమర్పణలో చిన్మయనంద ఫిల్మ్‌బ్యానర్‌పై ఎస్‌ సరిత నిర్మిస్తున్న చిత్రం ఇదేం దెయ్యం . శ్రీనాథ్‌మాగంటి హీరోగా పరిచయం అవ్ఞతున్నారు. సాక్షి కక్కర్‌,రచన స్మిత, రుచి పాండే నాయకలు. రచ్చ రవి,కిరాక్‌ ఆర్‌ పి కీలక పాత్రలు పొషించారు. రవివర్మ దర్శకత్వం వహించారు. ప్రతాని రామకృష్ణ సిడిలను ఆవిష్కరించి యూనిట్‌ సభ్యులకు అందచేశారు. అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం హర్రర్‌ చిత్రాల ట్రెండ్‌ నడుస్తుంది. కమర్శియల్‌ పాయింట్‌ తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.హరర్‌ కామెడి నేవథ్యంలో తెరకెక్కించారు.పాటలు చాలా బాగున్నాయి. నిర్మాతకు మంచి లాభాలు రావాలి అన్నారు.నిర్మాత డి ఎస్‌ రావ్ఞ మాట్లాడుతూ దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. హరర్‌ హాస్యం జోడించి తెరకెక్కించారు. పాటలు చాలా బాగున్నాయి. చిత్ర దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ రచ్చ రవి , శ్రీనాథ్‌ ను మనసులో పెట్టుకుని ఈ చిత్రం కథ వ్రాశాను. నేను అనుకున్న దాని కన్న బాగా నటించారు. శ్రీనాథ్‌ కొత్త కుర్రాడు అయినా బాగా నటించాడు.కామెడి హైలైట్‌గా పండింది.హరర్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు ధ్రిల్‌ను కలిగిస్తాయి. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్‌, శ్రీనాథ్‌,సాక్షి కక్కర్‌ తదితరులు పాల్గొన్నారు.