‘ఇగో’ గీతాలు విడుదల

EGO AUDIO11
EGO AUDIO

‘ఇగో’ గీతాలు విడుదల

వికెఎ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆశిష్‌రాజ్‌, సిమ్రన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఇగో.. విజ§్‌ు కరణ్‌, కౌశల్‌ కరణ్‌, అనిల్‌ కరణ్‌ నిర్మాతలు.. సుబ్రహ్మణ్యం ఆర్‌వి దర్శకుడు సాయికార్తీక్‌ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.. ఈ కార్యక్రమంలో త్రినాధరావు నక్కి, సిడబ్ల్యుఇ జగదీశ్‌ పర్వాని, బాలాజీ థర్డీ ఇయర్స్‌ పృధ్వీ తదితరులు పాల్గొన్నారు..
త్రినాధరావు థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరిచంగా, బిగ్‌సిడి ఆడియో సిడిలను దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ విడుదల చేశారు..

జగదీశ్‌ పర్వాని మాట్లాడుతూ ఆశిష్‌రాజ్‌లో మంచి ఎనర్జీ ఉందని, తను భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తాడని అన్నారు.. త్రినాధరావు మాట్లాడుతూ మంచి పవర్‌ఫుల్‌ టైటిల్‌, ఈ మధ్యకాలంలో క్యారెక్టరైజేషన్స్‌ బేస చేసుకుని తీస్తున్న సినిమాలు పెద్ద సక్సెస్‌ అవుతున్నాయని అన్నారు. ఈసినిమా కూడ పెద్ద హిట్‌ అవుతుందన్నారు.. సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ కూడ మంచి రిలేషన్‌ఉందని, మంచి కథకు తగ్గట్టుగా ఆశిష్‌ అద్భుతంగా నటించాడని అన్నారు.. దర్శకుడు సుబ్రహ్మణ్యం ఆర్‌వి మాట్లాడుతూ, సాయికార్తీక్‌ చక్కగా మ్యూజిక్‌ అందించారని, అన్నారు. హీరో ఆశిష్‌ సిమ్రన్‌ సహా అందరికీ థ్యాంక్స్‌ అన్నారు..