ఆ హక్కు ఎవ్వరికీ లేదు

Iliyana2
Iliyana

ఆ హక్కు ఎవ్వరికీ లేదు

తెలుగులో దేవదాసు, సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మహేష్‌ సూపర్‌హిట్‌ సినిమా పోకిరితో స్టార్‌హీరోయిన్‌గా మారిన నటి ఇలియానా. తాజాగా బాలవుడ్‌లో సెటిలయ్యారు.. కేవలం అక్కడి సినిమాలను మాత్రమే చేస్తున్న ఈమె తరచూ తన అభిప్రాయాల్ని సోషల్‌ మీడియాలో నిర్మొహమాటంగా తెలుపుతూ సంచలనంగా నిలుస్తూ ఉంటారామె.. తాజాగా ఆమె తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని ఉద్దేశించి చేసిన ట్వీట్లు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.
ట్విట్టర్‌లో ఆమె స్పందిస్తూ.. ‘మనం ఎంత వింత ప్రపంచంలో జీవిస్తున్నాం, నేనొక పబ్లిక్‌ ఫిగర్‌,. నాకు లగ్జరీ ప్రైవేట్‌ లైఫ్‌ ఉండదని నాకు తెలుసు..కానీ నాతో అనుచితంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. అభిమానులు దీని పట్ల కన్ఫ్యూజ్‌ అవ్వొద్దు.. ఏది ఏమైనా చివరికి స్త్రీని అంటూ పేర్కొర్నారు.. అయితే ఈవిడగారు ఇంత తీవ్రంగా స్పందించటం వెనుక అసలు కారణం ఏంటో ఇంకా బయటపడలేదు