ఆ సినిమాలో కేరెక్టర్‌ ఇదే

SUNIL
SUNIL

కమెడియన్‌ నుంచి హీరోగా మారిన సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తున్నారు..అందులో ఒకటి అరవింద సమేత.. ఈచిత్రంలో తన పాత్ర ఎలా ఉండనుందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారాయన.. చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. ఈసినిమాలో నా పాత్ర అతడు సినిమాలో మాదిరిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.. సిల్లీ ఫెలోస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటుచేసిన ఇంటర్వ్యూలో సునీల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అల్లరి నరేష్‌తో కలిసి ఆయన నటించిన సిల్లీ ఫెలోస్‌ ఈనెల 7న విడుదల కాబోతోంది..ఈచిత్రంలో ఆయన అల్లరి నరేష్‌ ఫ్రెండ్‌ పాత్రలో కన్పిస్తారు.. ఇక సునీల్‌, ఈరెండు చిత్రాలతోపాటు రవితేజ, శ్రీనువైట్ల కలయికలో తెరకెక్కుతున్న అమర్‌ అక్బర అంతోనీ చిత్రంలో కూడ నటిస్తున్నారు.