ఆనందంగా ఉంది: చిరంజీవి

Darsakudu 1st Show ticket

దర్శకుడు… తొలి ప్రేక్షకుడిని నేనే అయినందుకు ఆనందంగా ఉంది: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రిలీజ్‌ అవ్ఞతుంది అంటే చాలు మొదటిరోజు, మొదటి ఆట, మొదటి టికెట్‌ కోసం ఎలాంటి హడావ్ఞడి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మెగాస్టార్‌ చిరంజీవి ఓ సినిమాకి తొలి ప్రేక్షకుడైతే అవ్ఞను సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై సుకుమార్‌ సమర్పణలో దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా రూపొందించిన చిత్రం దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టు 4న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర మొదటి టికెట్‌ని స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి కొనుక్కుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో విశేసం ఏమిటంటే దర్శకులు సుకుమార్‌ మరియు హరిప్రసాద్‌ జక్కాలు చిరంజీవి సినిమా మొదటిరోజు మొదటి ఆట కోసం క్యూ కట్టిన వారి లిస్ట్‌లో ఉండటమే. తొలి టికెట్‌ని కొన్న చిరంజీవి దర్శకుడు సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్ర యూనిట్‌కి బెస్ట్‌ విషెష్‌ తెలియజేశారు.

నాకు చాలా కొత్తగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఫస్ట్‌ టికెట్‌ని నాకు అందించి, దర్శకుడు సినిమాకి నన్ను తొలి ప్రేక్షకుడిని చేసినటువంటి ఈ దర్శకుడు యూనిట్‌ సభ్యులకు, ముఖ్యంగా సుకుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు చిత్ర యూనిట్‌కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాని వెనకుండి నడిపించిన వెన్నెముక. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో గతంలో వచ్చిన కుమారి 21ఎఫ్‌ ఎంత సూపర్‌హిట్‌ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే.

అలాగే ఈ దర్శకడు చిత్రం కూడా సుకుమార్‌ సమర్పణలో తెరకెక్కడం, అలాగే ఆయన సోదరులు ఈ చిత్రానికి నిర్మాతలు కావడం అభినందించాల్సిన విషయం. సుకుమార్‌లో నచ్చిన విషయం ఏమిటంటే ఒక దర్శకుడిగా ఆయన ఉన్నతస్థానంలో ఉనానడు. తను కమరిషయల్‌ సినిమాలు చేసుకుంటూ, ఉన్న సమయంలో మంచి కథాన్వేషణలో మంచి కథలను క్రియేట్‌ చేసుకుంటూ,అటు కమర్షియల్‌గా డబ్బుని, పేరుని తను సంపాదించుకోవచ్చు. కేవలం నేనేమిటి అనకుండా, ఈ సినిమా ఇండస్ట్రీకి నేనేమిటి అనే కోణం నుంచి ఆలోచిస్తూ తను అప్‌కమింగ్‌ స్టోరీ రైటర్స్‌ని గానీ, అలాగే డైరెక్టర్స్‌ని గానీ, అలాగే ఆర్టిస్ట్‌లని గాని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోటి సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ని స్థాపించడం, అందులో ఔత్సాహికులైన కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. ఇందులో సుకుమార్‌ లైఫ్‌కి సంబంధించిన విషయమేదో కనెక్ట్‌ అయి ఉంటుంది. అందుకే ఈ సినిమాని తెరకెక్కించాలని భావించి ఉంటాడని అనుకుంటునానను. ఈ సినిమాలో హీరోగా నటించిన యంగ్‌స్టర్‌ అశోక్‌ మంచి హీరో మెటిరీయల్‌. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్లుగా నటించిన ఈషా, పూజితలకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కెమెరా ఇచ్చిన ప్రవీణ్‌, ఇంకా సాంకేతిక నిపుణులందరికి బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను. ఈ సినిమా కుమారి21ఎఫ్‌ కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.