అమలాపాల్‌పై అభియోగపత్రాలు దాఖలు

Amala paul
Amala paul

ప్రముఖ కథానాయిక అమలాపాల్‌పై అభియోగపత్రాలు దాఖలుకు కసరత్తు సిద్ధమైంది. నకిలీ చిరునామాతో కారు నమోదు, పన్ను ఎగవేత కేసులో ఆమెపై కేసు నమోదైన విషయం విదితమే. ఈ వ్యవహారంలో కోర్టులో లొంగిపోయిన ఆమె వెంటనే బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ కేసులో అబియోగ పత్రాలు నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం పోలీస్‌ శాఖను ఆదేశించినట్లు సమాచారం.