అనుపమ పరమేశ్వరన్‌ బర్త్‌డే వేడుక

Anupama parameswrarn Birthday
Anupama parameswrarn Birthday

అనుపమ పరమేశ్వరన్‌ బర్త్‌డే వేడుక

సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం తెలిసిందే.. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీస్‌ను తెరకెక్కించిన దర్శకుడు ఎ.కరుణాకరన్‌ , సాయిధరమ్‌తేజ్‌ , అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. ఈచిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ జరుగుతోంది.. ఏప్రిల్‌ 20 వరకు ఈ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది.. ఈసినిమా సాయిధరమ్‌తేజ్‌ సరసన అనుపమ నటిస్తోంది.. ఈమె పుట్టినరోజు ఫిబ్రవరి 18. కెఎస్‌రామరావు తనయుడు, ఈసినిమా సహ నిర్మాత కెకె వల్లభ పుట్టినరోజు కూడ ఫిబ్రవరి 18 కావటం విశేషం.. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో అనుపమ, పుట్టినరోజు వేడులను నిర్వహించారు.. అనుపమ పరమేశ్వరన్‌ తన బర్త్‌డే కేక్‌ను కట్‌ చేశారు.. ఇంత గ్రాండ్‌ గా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు.. నిర్మాత కెఎస్‌రామారావు మాట్లాడుతూ, అనుపమ పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్‌ చేయటం ఆనందంగా ఉందన్నారు. ఇదే రోజు మా అబ్బాయి వల్లభ పుట్టినరోజు కూడ అన్నారు. కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌తేజ్‌, కెఎ వల్లభ, దర్శకుడు కరుణాకరన్‌, సినిమాటోగ్రాఫర్‌ అండ్రూస్‌, డార్లింగ్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.