అదే రకుల్‌ స్పెషాలిటీ!

rakul
rakul

గ్లామర్‌ ప్రపంచంలో కొన్నేళ్లయినా హవా కొనసాగించాలంటే ..ఫిట్నెస్‌ కాపాడుకోవటం చాలా ముఖ్మమైన విషయం.. ఇందుకోసం స్టార్లు తెగ కష్టపడిపోతుంటారు.. ముఖ్యంగా హీరోయిన్లు అయితే వారి కష్టం మరీ వర్ణనాతీంగా ఉంటుంది.. ఉన్నంతలోనే సరదాలను వెతికేయటం ఆనవాయితీగా వస్తోంది..
సహజంగా హీరోయిన్లు వర్కవుట్స్‌ చేసేందుకు జిమ్‌లో గంటలకొద్దీ సమయం గడుపుతూ ఉంటారు. కానా టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాత్రం ఈ విషయంలో ప్రత్యేకతను చూపిస్తోంది.. తమ్ముడు అమన్‌తో కలిసి వర్కవుట్స్‌ చేస్తోంది.. అంతేకాదు.. ఇద్దరూ కలిసి జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోను కూడ నెట్‌లో పెట్టేసింది.. తమ్ముడి ట్రైనింగ్‌లోనే తన ఫిట్నెస్‌ను మెయింటెన్‌ చేస్తోంది ఈ భామ.. కాగా రకుల్‌కు హైదరాబాద్‌లోనే ఓ ఫిట్నెస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కి సంబంధించిన ఫ్రాంచైజీలున్నాయి.. వీటిని నిర్వహించేది ఎవరో కాదు.. ఆమె తమ్ముడే. మరోవైపు అమన్‌ ను సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నాలు కూడ చేస్తోదంట..