నేడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం

migrated BIRDS
migrated BIRDS

నేడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. యునెస్కో 2006 నుంచి వలస పక్షు దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. వ్యర్ధాలు, కాలుష్యం కారణంగా ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలు పక్షులకు విరామ స్థలాలుగా ఉంటున్నాయి. చారిత్రక ప్రదేశాల పరిరక్షణంటే వలస పక్షుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలుగా భావించాలి. ఎటువంటి కాలుష్యానికి పాల్పడకుండా ఆయా ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులను యునెస్కో కోరింది. వారసత్వ ప్రదేశాల్లో జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుందని అన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్దాలు, నూనెలు, పారిశ్రామిక వ్యర్దాలు పక్షలు, తేబేళ్లు, క్షీరదాల వంటి తదితర జీవుల మనుగడకే ముప్పు తెస్తున్నాయంది. వారసత్వ ప్రదేశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది మొదటి దశ అనిపేర్కొంది. వ్యర్దాలను తిరిగి ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలంది. వలస పక్షుల భవిష్యత్‌ అనేది మనం తీసుకునే చర్యల మీదనే ఆధారపడి ఉంటుందని యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ డైరక్టర్‌ పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/