స్విట్జర్లాండ్‌లో”వైన్‌ ఉత్సవాలు”

100 సంవత్సరాల కాలంలో అయిదు సార్లు మాత్రమే జరుగుతాయి

wine-festival
wine festival in Vevey

స్విట్జర్లాండ్‌: స్విట్జర్లాండ్‌లో ”వైన్‌ తయారీదారుల ఉత్సవాలు”గా పిలిచే వేడుకలు ఇరవై ఏళ్ల తర్వాత వేవే నగరంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అక్కడి ద్రాక్ష తోటల్లో జరిగే ఉత్సవాలు ప్రపంచంలో అత్యంత అరుదుగా జరిగే అతి పెద్ద వైన్ ఉత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. వైన్‌ ఉత్పత్తిలో వాడే ద్రాక్షను పండించే కార్మికులు ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. బ్రదర్‌ హుడ్‌ ఆఫ్ వైన్‌ బ్రోవర్స్‌గ అనే కమిటీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. 1797లో ప్రారంభం అయిన ఈ వేడుకలు 100 సంవత్సరాల కాలంలో అయిదు సార్లు మాత్రమే జరుగుతాయి. ఇప్పటి వరకు కేవలం 11 సార్లు మాత్రమే జరగగా, చివరగా 1999లో జరిగాయి. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 11 వరకు 12వ ఉత్సవం జరుగుతోంది. దాదాపు పదిలక్షల మంది ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కళాకారుల నృత్యాలు.. సంగీత కవాతు.. ఈ వేడుకల్లో భాగం అయినప్పటికీ అంతిమంగా వైన్ తయారీకి వాడే ద్రాక్ష పండించే కార్మికులను సత్కరించడమే ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/