157 దేశాలకు సోకినా కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ

6,515 మృతులు.. 1.69 లక్షలకు పైగా బాధితులు

World Health Organisation-covid-19
World Health Organisation-covid-19

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఇప్పటి వరకూ 157 దేశాలకు విస్తరించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా నిర్ధారించింది. మొత్తం 1,69,531 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, వారిలో 6,515 మంది మరణించారని వెల్లడించింది. చైనాలో మృతుల సంఖ్య 3,213కు చేరిందని, ఆ తరువాత ఇటలీలో 1,809 మంది, ఇరాన్ లో 724 మంది, స్పెయిన్ లో 292 మంది, ఫ్రాన్స్ లో 127 మంది, దక్షిణ కొరియాలో 75 మంది, అమెరికాలో 68 మంది, యూకేలో 35 మంది, జపాన్ లో 24 మంది, నెదర్లాండ్స్ లో 20 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/