ట్రంప్‌ వ్యాఖ్యలపై డబ్ల్యుహెచ్‌ఓ ఆగ్రహం

కరోనా వైరస్‌ను చైనీస్‌ వైరస్‌ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు కరోనా వైరస్‌ను చైనీస్‌ వైరస్‌ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO)  ఆగ్రహం వ్యక్తం చేసింది. వైర‌స్‌ల‌కు జాతి, కుల, ప్రాంతాలు ఉండవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ కు ఒక దేశం పేరును ఆపాదించడం తగదని ట్రంప్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ మేరకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైక్ ర్యాన్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ట్రంప్ త‌న ప్ర‌తి ట్వీట్‌లో తాజాగా కోవిడ్ 19ను చైనీస్ వైర‌స్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ ప్రాంతంతో వైర‌స్‌ను పోల్చ‌డం ఆక్షేపణీయమని చైనా ఫిర్యాదు చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/