వేగంగా కరుగుతున్న గ్రీన్‌లాండ్‌ మంచు

సుమారు 12 బిలియన్ టన్నుల మంచు కేవలం 24 గంటల్లో కరిగిపోయిందట

Greenland
Greenland

వాషింగ్టన్‌: ప్రపంచంలో అతిపెద్ద ద్వీపంగ్రీన్‌లాండ్ 90 శాతానికి పైగా భూభాగం మంచుతో కప్పబడిపోయిన ఈ ఐస్‌లాండ్ ఇప్పుడు తన ప్రాకృతిక అందాన్ని కోల్పోతుంది. ఇందులో ఉన్న మంచు అతి వేగంగా కరుగుతోంది. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తోంది. సుమారు 12 బిలియన్ టన్నుల మంచు కేవలం 24 గంటల్లో కరిగిపోయిందట. అయితే భూమిపై పెరిగిపోతున్న వేడిమికి అంటార్కిటికా ఖండంలోని మంచు గడ్డలు క్రమంగా కరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ముప్పు గ్రీన్‌లాండ్‌ను కూడా తాకింది. గతవారం రోజులుగా మంచు కరగడం ఎక్కువైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా జూలై 31న అతి ఎక్కువ మంచు కరిగిందని, 2012 నాటి నుంచి ఇదే ఎక్కువని తెలిపారు. ఒక్క జూలైలోనే 197 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయి అట్లాంటిక్ సముద్రంలో కలిసిందని వాతావరణ పరిశోధకులు రుత్ మొట్రామ్ తెలిపారు. దీంతో సముద్ర మట్టం 0.1 మిల్లీ మీటర్, 0.02 ఇంచులకు పెరిగిందని వారు తెలిపారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/