భారత్ లో పర్యటించనున్న ఐదు రాష్ట్రాల గవర్నర్లు

america
america

వాషింగ్టన్‌: అమెరికాలోని ఐదు రాష్ట్రాల గవర్నర్లు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు భారత్‌ సందర్శనకు వస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ, అర్కన్సాస్‌, కొలొరాడో, డెలావేర్‌, ఇండియానా రాష్ట్రాల గవర్నర్లు వచ్చే రెండు నెలల్లో భారత్‌ పర్యటనకు వస్తున్నారు. వారితోపాటు వారి రాష్ట్రాలకు చెందిన అత్యున్నతస్థాయి వాణిజ్యవేత్తల ప్రతినిధి బందాలు కూడా భారత్‌ పర్యటనకు రానున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/