2036 వరకు రష్యాకు పుతినే అధ్యక్షుడు

రాజ్యాంగ సవరణకు భారీగా ప్రజల ఆమోదం

VLADIMAR PUTIN
VLADIMAR PUTIN

రష్యా: వ్లాదిమిర్‌ పుతిన్ రష్యాకు 2036 వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగడానికి చేస్తున్న ప్రయత్నాలు చివరకు ఫలించాయి. 2036 వరకు ఆయనే తమ దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు. ఇందు కోసం రాజ్యంగ సవరణకు వారు అంగీకరించారు. కొన్ని రోజులుగా రాజ్యాంగ సవరణ కోసం రష్యా ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్న ఆ దేశ ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించింది. సుమారు 63 శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా, అందులో 73 శాతం మంది పుతిన్‌కు సానుకూలంగా ఓట్లు వేసినట్లు ప్రకటించింది. కాగా 2024 తరువాత మరో 12 ఏళ్లు కూడా అధ్యక్షుడిగా కొనసాగేలా పుతిన్ సవరణ చేయించుకున్నారు. అంటే, ఇప్పటి నుంచి మరో 16 ఏళ్ల పాటు పుతినే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఆయన 2000 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/