ఎన్‌ఆర్‌సిపై ఆందోళన చెందుతున్న అమెరికా సంస్థ

NRC
NRC

అమెరికా: అస్సాంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన కమిషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియతో భారత్‌లో ఏళ్ల తరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న 19 లక్షల మంది పౌరసత్వాన్ని కోల్పోనున్నారని పేర్కొంది. సరైన నియంత్రణ, పారదర్శకత లేకుండా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను చేపట్టడం వల్ల అసలు సిసలు భారతీయులకే దేశంలో చోటు లేకుండా ప్రమాదం ముంచుకొస్తోందని తన నివేదికలో పేర్కొంది. అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని, వారిని రాష్ట్రం నుంచి పంపించేయడానికే ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను నిర్వహించారని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ అనురిమ భార్గవ ఆరోపించారు.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/