అమెరికా జోక్య ఆమోదయోగ్యం కాదు

iranian tanker
iranian tanker

ఇరాన్‌: జిబ్రాల్టర్‌ నుండి మధ్యదరా సముద్రం మీదుగా పయనిస్తున్న ఇరాన్‌ చమురు ట్యాంకర్‌ ఆడ్రియన్‌ దార్యా1ను రేవులోకి అనుమతిచొద్దంటూ అమెరికా చేసిన సిఫారసులు, హెచ్చరికలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని గ్రీన్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) పేర్కొంది. కేకేఈ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల జేసింది. ఇరానియన్‌ ట్యాంకర్‌ గ్రీస్‌కు లేదా ఏ ఇతర ప్రాంతానికి వచ్చినా అడ్డుకోవాలని హుకుం జారీ చేయడం అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పన్నాగాన్ని తెలియజేస్తోందని అది తెలిపింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా పర్షియన్‌ గల్ఫ్‌లో వివిధ దేశాల మధ్య తంపులు పెట్టాలని అమెరికా చూస్తోందని, ఇది ఈ ప్రాంత్ర ప్రజలకు ప్రమాదకరమని కేకేఈ పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/