భారత్‌ను ప్రశంసించిన అమెరికా

అఫ్ఘాన్ కు భారత్ అందిస్తోన్న సహకారాన్ని స్వాగతిస్తున్నాం

India - Afghanistan-USA
India – Afghanistan-USA

వాషింగ్టన్‌: అఫ్ఘానిస్థాన్ నుంచి తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ సాయాన్ని కొనసాగించడాన్ని అమెరికా కొనియాడింది. అఫ్ఘాన్ కు భారత్ అందిస్తోన్న సహకారాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. 2001లో తాలిబన్లపై అమెరికా పోరాటానికి దిగిన నాటి నుంచి భారత్ మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందజేసిందని తెలిపింది. ఓ కార్యక్రమంలో అమెరికాకు చెందిన అఫ్ఘానిస్థాన్ విభాగం ఇన్ ఛార్జి జాక్సన్ మాట్లాడుతూ… అఫ్ఘాన్ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణాసియాపై అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగా భారత్ తో తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సత్సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. అఫ్ఘాన్ లో తాలిబన్లతో జరుగుతున్న యుద్ధానికి తెరదించాలని తమ దేశం కోరుకుంటోందని తెలిపారు. అఫ్ఘానిస్థాన్ లో భారత్ కీలక పాత్రం పోషిస్తోందని చెప్పారు. వివిధ రంగాల్లో 400 ప్రాజెక్టులను పూర్తిచేసిందని కొనియాడారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/