క్యూబా రక్షణ మంత్రిపై అమెరికా ఆంక్షలు

Leopoldo Cintra Frias
Leopoldo Cintra Frias

వాషింగ్టన్‌: క్యూబా విప్లవ సాయుధ దళాల మంత్రి లెపోల్డో సింట్రా ఫ్రియాస్‌ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్ప డుతున్నారంటూ అమెరికా ప్రభుత్వం ఆయనకు తమ దేశంలో ప్రవేశంపై నిషేధం విధించింది. అధ్యక్షుడు నికొలస్‌ మదురో సర్కారును సమర్ధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నందునే తాము ఫ్రియాస్‌పై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మదురో సర్కారులోని సైన్యం, ఇంటెలిజెన్స్‌ అధికారులతోపాటు మంత్రి కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నా రని, మదురో వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటున్న వెనిజులా ప్రజలపై అత్యంత క్రూరంగా, అమానుషంగా వ్యవహరిస్తూ వారిని చిత్రహింస లకు గురి చేస్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/