”గ్రీన్‌కార్డు బిల్లు”కు ఆమోదం

భారతీయులకు ఊరట

US House
US House

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డు బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ బుధవారం ఆమోదం తెలిసింది. దీంతో అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు, ఉద్యోగంచేసుకునేందుకు వలసదారులకు వీలు కల్పించే ప్రయోజనం కలుగుతుంది. అయితే ఒక్కో దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికి మించి గ్రీన్‌ కార్డులు ఇవ్వకూడదన్న నిబంధనలు ప్రవాస భారతీయులకు కష్టాలు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఈ కోటా పరిమితిని ఎత్తేయాలని కోరుతూ సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో దశాబ్దాల తరబడి గ్రీన్‌ కర్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు లభించనున్నాయి.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/