చైనా ఎగుమతులకు అమెరికా గండి

trump, jinping
trump, jinping

చైనా: అమెరికాతో వాణిజ్య యుద్ధం సెగ చైనాకు గట్టిగానే తగులుతున్నది. గత నెల ఆ దేశ ఎగుమతులు క్షీణించాయి మరి. ఆగస్టులో 1 శాతం పడిపోయినట్టు విడుదలైన చైనా అధికారిక గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. జూలైలో ఆశ్చర్యకరంగా 3.3 శాతం పెరిగిన నేపథ్యంలో ఆగస్టులో 1 శాతం క్షీణించడం గమనార్హం. కాగా, అమెరికాతో చైనా వాణిజ్య మిగులు కూడా దిగివచ్చింది. ఆగస్టులో 34.83 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, అంతకుముందు నెల 44.58 బిలియన్‌ డాలర్లు ఉన్నది. దిగుమతులు కూడా 5.6 శాతం తగ్గాయి. ఈ రెండు అగ్రదేశాల వాణిజ్య యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని బలితీసుకుంటున్న నేపథ్యంలో వచ్చే నెల మళ్లీ చర్చలకు అమెరికా, చైనా సిద్ధమవుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/