భారత్‌ ప్రకటనను సమర్థించిన అమెరికా

  • ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ప్రకటన
America and India
America and India

వాషింగ్టన్‌: జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, కశ్మీర్ లో లష్కరే తాయిబా సుప్రీం కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీలను టెర్రరిస్టులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే’. ఇటీవలే చట్ట రూపం దాల్చిన కొత్త ‘ఉగ్రవాద వ్యతిరేక చట్టం’ కింద వీరిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా సమర్థించింది. అజార్, సయీద్, దావూద్, రెహ్మాన్ లను టెర్రరిస్టులుగా భారత్ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అమెరికా తెలిపింది. టెర్రరిజాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ కు అండగా ఉంటామని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా భారత్అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఉపయోగపడుతుందని చెప్పింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/