కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం

కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో ఘటన

Man fires
Man fires

ఫ్రేస్నో:కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఫ్రెస్నో నగరంలో ఓ విందులో పాల్గొన్న వారిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 10 మంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, వారిలో నలుగురు మృతి చెందారని అక్కడి పోలీసులు వివరించారు. ఓ పార్టీ చేసుకునేందుకు గానూ ఓ కుటుంబం తమ బంధు, మిత్రులను ఆహ్వానించిందని అదే సమయంలో తుపాకీతో అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. విందు చేసుకుంటోన్న సమయంలో ఆ ప్రాంతంలో 35 మంది ఉన్నారని చెప్పారు. ఈ కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా, కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నగరంలో ఇటీవలే ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/