సమ్మె ప్రారంభించిన బ్రిటన్‌ యూనివర్శిటీ సిబ్బంది

University staff strike
University staff strike

లండన్‌ : వేతనాల పెంపుదల, పని పరిస్థితుల మెరుగుదల, పెన్షన్ల పెంపు తదితర డిమాండ్ల సాధనకు బ్రిటన్‌లో అన్ని యూనివర్శిటీల సిబ్బంది ఎనిమిది రోజుల సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మెకు విద్యార్థులు కూడా మద్దతు పలికారు. సమ్మెలో లెక్చరర్లతోపాటు అనుబంధ సేవల సిబ్బంది, ట్యూటర్లు, లైబ్రేరియన్‌లు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వున్న దాదాపు 63 యూనివర్శిటీల ముందు వేలాది మంది ధర్నా నిర్వహించారు. వివిధ యూనివర్శిటీలకు చెందిన 43,600 సిబ్బంది సమ్మెలో పాల్గొన్నట్లు యూనివర్శిటీ అండ్‌ కాలేజి యూనియన్‌ (యుసియు) వెల్లడించింది. బ్రిటన్‌లో దాదాపు సగం యూనివర్శిటీలతో పాటు లండన్‌ లోని యూనివర్శిటీ కాలేజ్‌, గోల్డ్‌స్మిత్స్‌ కాలేజ్‌, క్వీన్‌ మేరీ యూనివర్శిటీ, కోర్టాల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, ది ఓపెన్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌, యూనివర్శిటీ ఆఫ్‌ లీడ్స్‌, యూనివర్శిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్గో తదితర విద్యా సంస్థలు మూతపడ్డాయి. యూనివర్శిటీల సిబ్బందికి సంఘీభావంగా మాంచెస్టర్‌ నగరంలో విద్యార్థులు, లెక్చరర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/