కూలిన మిలటరీ విమానం.. 25 మంది మృతి

ukraine-military-plane-crash

కీవ్‌: ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మిలటరీ విమానం కుప్పకూలి 25 మంది దుర్మరణం చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరి ఆచూకీ కోసం ఘటనాలో స్థలంలో గాలింపు కొనసాగుతున్నది. విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నది స్పష్టంగా తెలియరాలేదు. ఏఎన్‌26 మిలటరీ విమానం ఇంజిన్‌ విఫలమై ఖార్‌కివ్‌ ప్రాంతం పరిధిలో శుక్రవారం రాత్రి కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/