మోడికి అరుదైన గౌరవం ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం!

UAE vice-president with modi
UAE vice-president with modi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. మోడికి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘జయాద్‌ మెడల్‌’ ను యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌( యూఏఈ) ప్రకటించింది. అయితే భారత్యూఏఈల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు ప్రధాని మోడి చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు. కాగా ఈ అత్యున్నత పురస్కారాన్ని గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ తదితరులు మాత్రమే అందుకున్నారు. తాజాగా వీరి సరన ప్రధాని మోడి చేరారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/