ఫ్యామిలీ వీసా హోల్డర్స్‌కు యుఎఇ శుభవార్త

Tourist places in UAE
Tourist places in UAE

UAE: యూఏఈలో ఫ్యామిలీ వీసాతో నివసిస్తున్న మగవారికి అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ఫ్యామిలీ వీసా కలిగిన ఉన్న మగవారికి కూడా వర్క్‌ పర్మిట్‌లను జారీ చేయనున్నట్టు మానవ వనరులు, ఎమిరేటైజేషన్‌ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కంపెనీలకు, అదే విధంగా అనేక కుటుంబాలకు లాభం చేకూరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అనేక కంపెనీలు మగ వర్కర్ల కోసం బయట దేశాల వైపు చూసేయని, ఇప్పుడు ఈ నిబంధనతో స్థానికులకే ఉద్యోగ అవకాశం లభిస్తుందని మానవ వనరులశాఖ మంత్రి నాజర్‌ బిన్‌ థానీ అల్‌ హమ్లీ తెలిపారు.
రెండేళ్ల వర్క్‌ పర్మిట్‌కు గాను నైపుణ్యం కలిగిన వర్కర్లు 300 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుది. ఇంతకు ముందు కంపెనీని బట్టి ఈ ఫీజు 300 దిర్హామ్‌ల నుంచి 5000 దిర్హామ్‌ల వరకు ఉండేది. జులై నెలలో ప్రభుత్వం ఈ ఫీజును 145 సర్వీసులలో 50 నుంచి 90 శాతానికి తగ్గించేసింది.