చైనాలో ప్రమాదం.. 26 మంది సజీవదహనం

Tourist Bus Catches Fire In China
Tourist Bus Catches Fire In China

చైనా: మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డె పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పర్యాటకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది పర్యాటకులు, ఒక టూరిస్టు గైడ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/