ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

  • రిక్టర్ స్కేలుపై 6.9గా తీవ్రత నమోదు
earthquake hit in Jakarta, Indonesia
earthquake hit in Jakarta, Indonesia

ఇండోనేషియా:ఇండోనేషియా రాజధాని జకార్తాలో శుక్రవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో బెంబేలెత్తిన ప్రజలు వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. సుమత్రా, జావా దీవుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉందని జియోలాజికల్ అధికారులు తెలిపారు. తొలుత సునామీ హెచ్చరికలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఇక, ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంత వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/