టైఫూన్‌ మంగుట్‌ విలయ తాండవం

Trypoon Mangit
Trypoon Mangit

టైఫూన్‌ మంగుట్‌ విలయ తాండవం

మనీలా: టైఫూన్‌ మంగుట్‌ ఫిలిప్పీన్స్‌తో పాటు పలు ఆగ్నేయాసియా దేశాలను అతలా కుతలం చేస్తోంది. గంటకు 220కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గత రెండు రోజులలో ఉత్తఫిలిప్పీన్స్‌లో 14మంది మృతి చెందారు. ఫిలిప్పీన్స్‌, వియత్నాం, దక్షిణ చైనా, హాంకాంగ్‌ దేశాలలో రెండు రోజులుగా ప్రజా జీవనం స్తంభించి పోయింది. గత ఆరు దశాబ్దాలలో మంగుట్‌ లాంటి బలమైన టైఫూన్‌ హాంకాంగ్‌ను తాకలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా హాంకాంగ్‌లో వ్యాపారసంస్థలు, కార్యాలయాలు పూర్తిగా మూత పడ్డాయి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌నుండి దక్షిణ చైనా వైపుకు కదులుతున్న టైఫూన్‌ సముద్ర తీర దేశాలను, ప్రాంతాలను అల్లాడిస్తోంది.

ఉత్తర కరోలినాలో వీర విహారం చేస్తున్న హరికేన్‌ ఫ్లోరెన్సు కన్నా రెండు రెట్లు బలంగా వేగంగా టైఫూన్‌ మంగుట్‌ విధ్వంసానికి పాల్పడుతోందని హాంకాంగ్‌ వాతావరణ శాఖ తెలిపింది. 50లక్షల మంది ప్రత్యక్షంగా టైఫూన్‌ ప్రభావానికి లోనయ్యారని తెలిపారు. పలు దేశాలలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకు వెళ్లినట్లు అంతర్జాతాయ మీడియా తెలిపింది. టైఫూన్‌ మంగుట్‌ ధాటికి ఫిలిప్పీన్స్‌ ఎక్కువగా ప్రభావితం అయింది. వేగంగా వీస్తున్న గాలకు ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి వేలాది హెక్టార్లలో పంట నాశనం అయింది. రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి.