చైనాకు టారిఫ్‌లు పెంచిన ట్రంప్‌!

మరో ఐదుశాతం టారిఫ్‌లు

america china
america china

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు మరోసారి టారీఫ్‌లు పెంచారు. అమెరికా వస్తువులపై టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన ట్విటర్‌ కరవాలాన్ని చైనాపై దూశారు. చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారీఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ టారీఫ్‌లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు 25శాతం టారీఫ్‌ల పరిధిలో ఉన్నాయి. వీటిని ట్రంప్‌ 30శాతానికి పెంచారు. అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక మరో 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారీఫ్‌లను 10శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఇవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/