వాణిజ్య యుద్ధం పై ట్రంప్‌ స్పష్టత

trump
trump

వాషింగ్టన్‌: అమెరికాచైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇంకా ముగియలేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని శుక్రవారం రాత్రి ట్రంప్‌ తెల్చి చెప్పారు. సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వారు నాతో ఎలాంటి చర్చలు జరపలేదు, ఎందుకంటే నేను దానికి ఒపుకోనని వారికి తెలుసు. అందుకే సుంకాల ఎత్తివేతను తాను ఖండిస్తున్నా’ అంటూ మీడియాకు తెలిపారు. అయినా ఇది ఎప్పటికి జరగని పని అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా ఆర్ధికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుందని.. అందుకే ఇటువంటి ఒప్పందాల కొరకు పాకులాడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వారం ఇరు దేశాల మధ్య సుంకాలను దశలవారిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దానికి తెరపడినట్లేనని అంతా భావించారు. కానీ, తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనతో మళ్లీ ఆందోళన మొదలైంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/