వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే

trump
trump

వాషింగ్టన్‌: ఒక పక్క తనపై అభిశంసన తీర్మానానికి డెమోక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పట్టును మరింత బిగించారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తనను ఎన్నుకోకపోతే దేశం తీవ్రస్థాయిలో మాంద్య పరిస్థితులకు గురవుతుందని హెచ్చరించారు. లూసియానాలో జరిగిన రిపబ్లికన్‌ ర్యాలీలో మాట్లాడిన ఆయన మళ్లీ తనదే విజయమన్న ధీమాను వ్యక్తం చేశారు. మనమే గెలుస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ చాలా మెజారిటీతోనే విజయం సాధిస్తాం అని తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ అన్నారు. పలు రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో ట్రంప్‌ తన స్వరాన్ని పెంచడం గమనార్హం. తన అధ్యక్ష తన అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని పుంజుకుంటోందని పేర్కొన్న ఆయన మళ్లీ తనను ఎన్నుకోకపోతే మాత్రం పరిస్థితి ప్రతికూలమైపోతుందని, మాంద్య తాండవిస్తుందని అన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/