భారత సంతతికి చెందిన మహిళకు ఉన్నత పదవి

Shireen Matthews
Shireen Matthews

వాషింగ్టన్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ మహిళకు ఉన్నత పదవి లభించింది. కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన అమెరికన్‌ షిరీన్‌ మ్యాథ్యుస్‌ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. మాథ్యూస్‌ నామినేషన్‌ ఆమోదం పొందితే ఆ పదవికి ఎన్నికైన తొలి ఆసియన్‌ పసిఫిక్‌ అమెరికన్‌ మహిళగానే కాకుండా ఆర్టికల్‌ థర్డ్‌ ఫెడరల్‌ జడ్జిగా సేవలు అందించే తొలి భారత సంతతికి చెందిన అమెరికన్‌ మహిళగా కూడా మాథ్యూస్‌ పేరు గడిస్తారని నేషనల్‌ ఆసియన్‌ పసిఫిక్‌ అమెరికన్‌ బార్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఎపిఎబిఎ) తెలిపింది. ఆర్టికల్‌ థర్డ్‌ జడ్జిల పదవి పరిమిత పరిస్థితుల్లో మినహాయించి వారి జీవితకాలం ఉంటుంది. ప్రతినిధుల సభలో అభిశంసన ద్వారా గాని, సెనెట్‌ తీర్మానం ద్వారా గాని వీరిని ఆ పదవి నుండి తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాథ్యూస్‌ అమెరికాలోనే అది పెద్ద లా కంపెనీలలో ఐదవదిగా ఉన్న జోనెస్‌ డేల్‌లో భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీ శాన్‌డియాగోలో ఉంది. మాథ్యూస్‌ ఆ కంపెనీలో భాగస్వామి కావడానికి ముందు కాలిఫోర్నియాలోని అమెరికా అటార్నీ కార్యాలయ క్రిమినల్‌ విభాగంలో ఆసిస్టెంట్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ అటార్నీగా పనిచేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/