బ్రిటన్‌ ప్రధానికి ట్రంప్‌ ఆహ్వానం!

Johnson-Trump
Johnson-Trump

వాషింగ్టన్‌: ఈ ఏడాది వైట్‌హౌస్‌లో నిర్వహించే కొత్త సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించినట్లు అమెరికన్‌ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. అయితే బోరిస్‌ జాన్సన్‌ పర్యటన తేదీ, సమయం ఇంకా ఖరారు కాలేదని దీనిపై చర్చలు జరుగుతున్నాయని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికన్‌ మీడియా వెల్లడించింది. బ్రిటన్‌ ప్రధాని జనవరి మధ్యలో అమెరికాలో పర్యటించే అవకాశం వుందని, అయితే ఇందుకు సంబంధించిన కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదని మీడియా తన కథనాలలో పేర్కొంది. కానీ 2020 ఆరంభంలోనే బ్రిటన్‌ ప్రధాని అమెరికాలో పర్యటించే అవకాశం వున్నట్లు వైట్‌హౌస్‌ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/