విచారణకు రండి లేదంటే ఫిర్యాదులు చేయడం ఆపండి

డొనాల్డ్‌ ట్రంప్‌కు జెరాల్డ్‌ నాడ్లర్‌ లేఖ

Jerrold Nadler & donald trump
Jerrold Nadler & donald trump

అమెరికా: డిసెంబర్‌ 4న జరగబోయే అభిశంసన విచారణకు అమెకరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కావాలని చట్టసభ కాంగ్రెస్‌ కోరింది. ట్రంప్‌ పై అభిశంసన తీర్మానం చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలసిందే. కాగా ఈ నేపథ్యంలో జ్యుడిషియరీ కమిటీ డెమొక్రటిక్‌ చైర్మన్‌ జెరాల్డ్‌ నాడ్లర్‌, ట్రంప్‌ ఈ విచారణకు రావాలని, లేదంటే ఈ ప్రక్రియపై ఫిర్యాదులు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. వచ్చే నెలలో జరిగే విచారణకు హాజరుకావాలని తాను ట్రంప్‌కు లేఖ రాసినట్లు నాడ్లర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయని.. విచారణకు హాజరై వివరణ ఇవ్వడం, ఈ ప్రక్రియపై మాట్లాడకుండా ఉండడం అని నాడ్లర్‌ తెలిపారు. ట్రంప్‌ ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు అవుతారా? లేక గతంలోని అధ్యక్షుల మాదిరిగా తన తరపు న్యాయవాదులను పంపించడం కానీ చేస్తారని ఆశిస్తున్నానని జెరాల్డ్‌ నాడ్లర్‌ అన్నారు. ఒకవేళ న్యాయవాదిని ఆయన పంపాలని నిర్ణయించుకుంటే ఆ న్యాయవాది ఎవరో తెలియజేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా విచారణకు హాజరయ్యేదీ లేనిది డిసెంబర్‌ 1 సాయంత్రం వరకు చెప్పాలని ఆయన అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/