ట్రంప్‌కు పొంచి ఉన్న పదవీగండం!

Trump
Trump

వాషింగ్టన్‌:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పదవీగండం పొంచి ఉన్నది. ఆయన అభిశంసన ప్రక్రియ తుది దిశకు చేరుకున్నది. ట్రంప్‌ తన విస్తృత అధికారాలను దుర్వినియోగం చేవారని, జాతీయ భద్రతను బలహీనం చేశారని, ఎన్నికల వ్యవస్థకు హాని కలుగజేశారని ఆరోపిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని స్పీకర్‌ నాన్సీ పెలోసి సభాధ్యక్షుడికి సిఫారసు చేశారు. అమెరికా అధ్యక్షుడు మాకు మరో మార్గం లేకుండా చేశారు అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతినిధుల సభలో డెమోక్రాటిక్‌ పార్టీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో తీర్మానం ఆమోదం పొందడం లాంఛనమేనని నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగితే అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ నిలువనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/