గ్రీన్‌ ల్యాండ్‌ ద్వీపంపై కన్నేసిని ట్రంప్‌!

  • తన సలహాదారులతో చర్చించిన ట్రంప్
Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ద్వీపంపై కన్నేశారా? దీన్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే ట్రంప్ సన్నిహితవర్గాలు అవుననే అంటున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేసేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నిన్న కొందరు చట్టసభ్యులతో భేటీ సందర్భంగా ట్రంప్ తన సలహాదారులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారీ ఎత్తున సహజవనరులతో పాటు గ్రీన్ ల్యాండ్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నందున ట్రంప్ ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించాయి.

8.36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం, 56,000 వేల జనాభా ఉన్న గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ లోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం. ఈ ద్వీపం డెన్మార్క్ లో భాగమైనప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఉంది. 1867లో అలాస్కాను అప్పటి యూఎస్ఎస్ ఆర్(రష్యా) నుంచి అమెరికా కొనుగోలు చేసింది.

అనంతరం 1946లో గ్రీన్ ల్యాండ్ కు తమకు అమ్మితే 712.54 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే ఎందుకో అప్పట్లో ఇది కుదరలేదు. కాగా, ట్రంప్ ప్రతిపాదనపై ఇటు అమెరికా, అటు డెన్మార్క్ ప్రభుత్వ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చే నెలలో డెన్మార్క్ లో పర్యటించనున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/