అభిశంసన విచారణలో పాల్గొనం!

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ చేపట్టిన అభిశంసన విచారణలో వైట్‌హౌస్‌ పాల్గొనబోదని ట్రంప్‌ తరపున న్యాయవాది పాట్‌ సిప్పోలోస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రతినిధుల సభ జుడీషియర్‌ కమిటీ చైర్మన్‌ జెర్రీ నాడ్లర్‌కు ఒక లేఖ రాశారు. ప్రతినిధుల సభా సంఘం జరిపే విచారణ నిష్పాక్షికంగా వుంటుందన్న భావన తమకు కలవడం లేదని, అధ్యక్షుడి పట్ల కమిటీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయంలో సృష్టత లేనందున వైట్‌హౌస్‌ ఈ విచారణలో పాల్గొనబోదని ఆయన తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో విచారణకు తాము హాజరు కావటం లేదని ఆయన వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/