నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్‌!

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికాలో నేషనల్‌ ఎమెర్జెన్సీని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే విదేశి శత్రువుల నుండి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌ వర్క్‌కు ముప్పు ఉండటంతో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేరొన్నారు.ఈ ఆదేశాల్లో ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకోని ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్‌ సేవలను వినియోగించకుండా అడ్డుకట్ట పడింది. ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు హువాయి.. చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా హువావే 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ట్రంప్‌ చర్యను ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ పై స్వాగతించారు. అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అని అన్నారు.


హువావేపై ఆంక్షలు..


నేషనల్‌ ఎమర్జెన్సీతోపాటు అమెరికా మరో చర్య కూడా తీసుకొంది. దీని ప్రకారం హువావేపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదు. ఈ చర్యతో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిపై చైనాకు చెందిన హువావే స్పందించింది. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని పేర్కొంది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/