నేటి నుండి ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన

Melania Trump , Donald Trump
Melania Trump , Donald Trump

లండన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన ఈరోజు నుండి ప్రారంభం కానుంది. బ్రెగ్జిట్‌ విషయంలో ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్న బ్రిటన్‌కుట్రంప్‌ తనదైన ఉచిత సలహా ఇచ్చారు. ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే బయటకు రావాలన్నారు.ఆయన బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే వారసుడికి ఈ సలహా ఇచ్చారు. మే వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ఈయూతో ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా, నిర్భయంగా తిరస్కరించాలన్నారు. బ్రిటన్‌ స్థానంలో నేనే కనుక ఉంటే, అంతపెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదని ట్రంప్‌ అంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/