అమెరికా సుప్రీంకోర్డు జడ్జిగా అమీ కోనే!

అమీ కోనేను నామినేట్‌ చేసిన ట్రంప్‌

amy-kone-barat

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అమెరికా సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా జడ్జి అమీ కోనే బారెట్‌(48)ను నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో అత్యంత మేథాసంపత్తి కలిగిన వారిలో ఒకరైన అమీ కోనేను జస్టిస్‌గా నామినేట్‌ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అమీ కోనే సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఎన్నికైతే అతి పిన్న వయసులో ఈ పదవి చేపట్టిన మహిళగా చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. కోనే బారెట్ నియామకంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా సుప్రీంకోర్టు జస్టిస్‌ రుథ్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌ (87) ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/