ట్రంప్‌ ట్వీట్‌కు దీటుగా స్పందించిన గ్రెటా థన్‌ బర్గ్‌

ట్విట్టర్ లో మండిపడిన ట్రంప్

Trump - Greta Thunberg
Trump – Greta Thunberg

వాషింగ్టన్‌: ఇటీవల యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ ను  ‘టైమ్‌’ మేగజైన్, 2019 సంవత్సరానికిగాను ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఈయర్‌’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దీనిపై ఓ ట్వీట్ పెట్టారు. టైమ్ పత్రిక తెలివి తక్కువ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఆపై గ్రెటా తన కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం ఎలాగన్న విషయమై దృష్టిని సారించాలని సూచించాడు. తన స్నేహితునితో కలిసి ఓ మంచి సినిమాకు వెళ్లాలని చెబుతూ ‘చిల్ గ్రెటా చిల్!’ అని ట్వీట్ చేశారు. ఇక దీన్ని చూసిన గ్రెటా, వెంటనే స్పందించారు. ట్విట్టర్ లో తన బయోడేటాను మార్చేశారు. ప్రస్తుతం తాను కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడంపై దృష్టి సారించిన టీనేజర్ నని, ప్రస్తుతం ఒక ఫ్రెండ్‌ తో కలిసి సినిమా చూస్తూ ఆనందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ కు రిటార్డ్ ఇచ్చిన గ్రెటాను ఉద్దేశించి, చక్కగా స్పందించావంటూ పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/