అక్కడ ఇసుకను దొంగలిస్తే జైలుకే!

italy-beach
italy-beach

శార్డీనియా(ఇటలీ): సముద్రపు ఒడ్డున ఇసుకను దొంగలించడం కూడా ఇటలీలో నేరమే. అలా చేసి ఇద్దరు ఫ్రెంచ్ టూరిస్టులు జైలు పాలయ్యారు. శార్డీనియాలోని చియా బీచ్‌లో 90 పౌండ్ల ఇసుకను దొంగలించిన ఇద్దరు ఫ్రెంచ్ టూరిస్టులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 14 సీసాలలో ఇసుకను తీసుకుని నౌకలో తమ దేశానికి వెళ్లిపోతున్న వారిద్దరినీ ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇసుకను తమ పర్యటనకు గుర్తుగా తీసుకువెళుతున్నామని వారు చెప్పినప్పటికీ పోలీసులు తమ చట్టాల ప్రకారం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అక్కడి చట్టాల ప్రకారం ఇసుకను చౌర్యం చేసిన ఆ ఇద్దరు టూరిస్టులకు ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. 2017 ఆగస్టులో చేసిన చట్టం ప్రకారం శార్డీనియాలోని బీచ్‌లలో ఇసుక, గవ్వలు, ఆల్చిప్పలు, శంఖాలు వంటివి తీసుకెళ్లడం నేరం. అయితే పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ రకమైన కఠిన శిక్షలు విధించాల్సి వచ్చిందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/